vishal: భారీ రేటుకు 'పందెం కోడి 2' రైట్స్ .. విశాల్ తోనే 'టెంపర్' రీమేక్

  • తమిళంలో 'టెంపర్' రీమేక్ 
  • నిర్మాతగా 'ఠాగూర్' మధు 
  • వచ్చేనెలలో సెట్స్ పైకి

తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'టెంపర్' భారీ విజయాన్ని అందుకుంది. కంటెంట్ పరంగా ఈ సినిమా ఇతర భాషా దర్శక నిర్మాతలను .. హీరోలను ఆకట్టుకుంది. ఈ కారణంగానే ఈ సినిమా తమిళంలోను రీమేక్ అవుతోంది. ప్రముఖ నిర్మాత 'ఠాగూర్' మధు .. విశాల్ హీరోగా ఈ సినిమాను తమిళంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలు పెట్టనున్నారు. తమిళనాట విశాల్ కి మాస్ ఇమేజ్ ఎక్కువగా ఉండటం వలన ఈ సినిమాకి ఆయన కరెక్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క, త్వరలో తెలుగులో 'పందెం కోడి 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులను 'ఠాగూర్' మధు తీసుకున్నారు. శాటిలైట్ హక్కులు .. తెలుగు వెర్షన్ హక్కులను కలుపుకుని దాదాపు 10 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా చెప్పుకుంటున్నారు.    

More Telugu News