polavaram: పోలవరాన్ని రాజకీయం చేసింది ఎవరు?: నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యలపై రఘువీరారెడ్డి

  • పోలవరం కాంగ్రెస్ మానస పుత్రిక
  • అంచనాల వ్యయం గురించి బీజేపీ, టీడీపీలకి లెక్కలు కుదరలేదట
  • ఏ లెక్కలు కుదర్లేదు.. కమీషన్ల లెక్కలా?
  • భూసేకరణ చట్టాన్ని ఎందుకు మార్చారు?

పోలవరం అంశాన్ని రాజకీయం చేయొద్దని నిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందించారు. అసలు పోలవరాన్ని రాజకీయం చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. ఈ మేర‌కు విజయవాడలోని ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

"పోలవరం కాంగ్రెస్ మానస పుత్రిక. కాంగ్రెస్ హయాంలో 5,500 కోట్లు వెచ్చించాం. జాతీయ హోదా ఇచ్చింది, ముంపు మండలాలను కలుపుతూ ఆర్డినెన్స్ ఇచ్చింది, 2013 భూసేకరణ చట్టం తెచ్చి నిర్వాసితులకు న్యాయం చేయాలనుకున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే.

2013 భూసేకరణ చట్టానికి  3 సార్లు ఆర్డినెన్స్ ద్వారా సవరణలు తెచ్చి తూట్లు పొడవాలని చూసింది బీజేపీ కాదా? ఈ రాష్ట్రంలో 2013 భూసేకరణ చట్టాన్ని మారుస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది టీడీపీ ప్రభుత్వం కాదా? అసలు పోలవరం నిర్మాణాన్ని రాష్ట్రానికి ఇచ్చిందెవరు? తీసుకున్నదెవరు? ఈ రోజు అంచనాల వ్యయం గురించి ఇద్దరికీ లెక్కలు కుదరలేదట..

ఏ లెక్కలు కుదర్లేదు.. కమీషన్ల లెక్కలు కుదర్లేదు... 4 ఏళ్ల నుంచీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏమి చేస్తున్నారు? ఇవాళ నితిన్ గడ్కరీ, చంద్రబాబులు కూర్చుని లెక్కలు తేలుస్తారా? పైగా రాజకీయాలు లేవంటూ ఉపదేశాలు ఇస్తారా? ఎవరు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ప్రజలకు తెలుసు.. కాంగ్రెస్ వల్లనే ఈ రోజు పోలవరం పని జరుగుతోంది" అని అన్నారు.

More Telugu News