ram gopal varma: ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడిపై రాంగోపాల్ వర్మ ప్రశంసలు

  • ఈ సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు
  • అజయ్ భూపతికి, కార్తికేయ, పాయల్ కు అభినందనలు
  • సూపర్ ఓపెనింగ్స్, సూపర్ టాక్ వస్తున్నాయి

అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దగ్గర గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అజయ్ భూపతి పని చేశారు. ఈ సందర్భంగా వర్మ స్పందిస్తూ, తన శిష్యుడిపై ప్రశంసలు కురిపిస్తూ ఓ ట్వీట్ చేశారు. 

‘‘ఆర్ఎక్స్ 100’ను చూసేందుకు ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్న దర్శకుడు అజయ్ భూపతికి, నటీనటులు కార్తికేయ, పాయల్ కు అభినందనలు కురిపిస్తున్నా. ఈ సినిమాకు సూపర్ ఓపెనింగ్స్ తో పాటు సూపర్ టాక్ వస్తోంది’ అని వర్మ ప్రశంసలు కురిపించారు.

More Telugu News