polavaram: డీపీఆర్‌-2 ఇచ్చి ఏడాది అయ్యింది!: పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు

  • పోలవరం పనులు 56.34 శాతం పూర్తి
  • ఖర్చు పెట్టిన దాంట్లో రూ.2,250 కోట్లు రావాల్సి ఉంది
  • పనులు త్వరగా పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాం 
  • కానీ, నిధులు ఇవ్వాలి

పోలవరం పనులు 56.34 శాతం పూర్తయ్యాయని, దీనిపై డీపీఆర్‌-2 ఇచ్చి ఏడాది అయిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి 1,500 రోజులు గడిచిన సందర్భంగా ఈరోజు అమరావతిలో తమ పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకి మనం ఖర్చు పెట్టిన దాంట్లో ఇంకా రూ.2,250 కోట్లు కేంద్రం నుంచి రావాలని, పనులు త్వరగా పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాం కానీ, నిధులు ఇవ్వాలని అన్నారు.

పట్టిసీమ వల్ల నీళ్లు అందుతున్నాయని, అయినా ఆ ప్రాజెక్టును కూడా విమర్శిస్తున్నారని అన్నారు. విభజన వల్ల మనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటే పదేళ్లు పడుతుందని అన్నారు. తమ పాలనలో సులభతర వాణిజ్యంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని, స్వచ్ఛభారత్‌లోనూ అవార్డులు వచ్చాయని ఇలా చాలా విషయాల్లో ముందున్నామని అన్నారు. 

More Telugu News