akhil: తమపై వస్తున్న అసత్య వార్తలను ఎద్దేవా చేస్తూ... దర్శకుడితో కలిసి అఖిల్‌ వీడియో!

  • వెంకీ అట్లూరీ దర్శకత్వంలో అఖిల్‌ సినిమా
  • వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని గాసిప్స్‌
  • సినిమా ఆగిపోయే ప్రమాదం ఉందని వార్తలు
  • విభేదాలు వచ్చినట్లు నటించి బిగ్గరగా నవ్విన వెంకీ, అఖిల్

సోషల్ మీడియాతో పాటు చాలా వెబ్‌సైట్లలో సినిమాలు, సెలబ్రిటీల గురించి ఎన్నో గాసిప్స్‌ వస్తుంటాయి. ఈ అసత్య వార్తలతో సెలబ్రిటీలు విసిగిపోతున్నారు. అక్కినేని వారబ్బాయి అఖిల్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, స్క్రిప్టులో వెంకీ మార్పులు చేస్తుండడంతో అఖిల్‌కు అది న‌చ్చ‌క  రెండురోజులు షూటింగ్‌కు రాలేద‌ని ఇటీవల గాసిప్స్‌ వచ్చాయి.

అంతేగాక ఈ సినిమా ఆగిపోయే అవకాశం కూడా ఉందని ఊహాజనితంగా పలు వెబ్‌సైట్లు రాసుకొచ్చాయి. వాటిని గుర్తించిన అఖిల్‌, వెంకీ అటువంటి వార్తలను ఎద్దేవా చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. 'మీరే డైరెక్టురుగా.. ముందుగా మీరే మాట్లాడండి.. మీరు హీరోగా మీరే మాట్లాడండి' అంటూ ఇరువురు నిజంగానే గొడవ పడుతున్నట్లు ఆ వీడియో ఉంది. చివరికి వారిద్దరూ బిగ్గరగా నవ్వారు.             

More Telugu News