oppo find x: అద్భుత ఫీచర్లతో నూతన స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసిన ఒప్పో!

  • అద్భుత ఫీచర్ లతో ఒప్పో ఫైండ్ ఎక్స్ విడుదల
  • స్మార్ట్ ఫోన్ ధర రూ. 59,999
  • గత నెలలోనే పారిస్ లో విడుదల చేసిన ఒప్పో

చైనాకు చెందిన ఒప్పో కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఫైండ్ ఎక్స్ ను తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసింది. గత నెలలోనే పారిస్ లో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ తాజాగా నేడు భారత మార్కెట్ లోకి ప్రవేశించింది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టమ్, 6.42 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే గల ఈ స్మార్ట్‌ఫోన్ ధర మన దేశంలో రూ.59,999 గా నిర్ణయించారు. ఫుల్ స్క్రీన్ తో పాటు పలు ఆకట్టుకునే ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.


ఒప్పో ఫైండ్ ఎక్స్ ప్రత్యేకతలు:

  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
  • 6.42" ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
  • 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్
  • 16/ 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా
  • 25 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
  • 3డీ ఫేషియల్ రికగ్నిషన్, ఫేస్ అన్‌లాక్
  • 3730 ఎంఏహెచ్ బ్యాటరీ

More Telugu News