nagarjuna: 'దేవదాస్' విడుదల తేదీ ఖరారైపోయింది

  • శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'దేవదాస్'
  • హీరోలుగా నాగార్జున .. నాని
  • నిర్మాతగా అశ్వనీదత్  

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని ఒక మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను పూర్తిచేశారు. రీసెంట్ గా ఈ సినిమాకి 'దేవదాస్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ఖరారు చేశారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అటు నాగ్ అభిమానులు .. ఇటు నాని ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో డాన్ గా నాగార్జున .. డాక్టర్ గా నాని కనిపిస్తారని అంటున్నారు. సినిమాలో ఈ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉంటారని చెబుతున్నారు. 'భలే మంచిరోజు'తో హిట్ అందుకున్న శ్రీరామ్ ఆదిత్య, ఈ సినిమాతోనూ తనకి సక్సెస్ లభించడం ఖాయమనే నమ్మకంతో వున్నాడట.      

More Telugu News