polavaram: ‘పోలవరం’ పనుల పురోగతిపై గడ్కరీ సంతృప్తి వ్యక్తం చేశారు: సీఎం చంద్రబాబు

  • నిర్మాణ పనులు వేగవంతంగా జరగడం చూసి ఆశ్చర్య పోయారు
  • సవరించిన అంచనాల ప్రకారం రూ.57,940 కోట్లు అవుతుంది
  • త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా చూడాలని కోరాం

పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిన్న పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ విషయమై చంద్రబాబు స్పందిస్తూ, పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై నితిన్ గడ్కరీ సంతృప్తి, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని, నేరుగా ప్రాజెక్టును సందర్శించిన అనంతరం పనుల్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తోందని, ఓ భారీ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరగడం చూసి తనకు ఆశ్చర్యమేసిందని చెప్పిన గడ్కరీ తమను ప్రశంసించారని పేర్కొన్నారు.

సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి రూ.57,940 కోట్లు అవుతుందని గడ్కరీకి వివరించామని, ఇందులో భూసేకరణకే రూ.33 వేల కోట్లు అవుతుందని త్వరితగతిన కేంద్రం నుండి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరామని, 2019 డిసెంబర్‌ డెడ్‌లైన్‌గా పెట్టుకున్నామని ఆయనకు తెలియజేశామని చంద్రబాబు తన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

More Telugu News