Sacred Games: అన్ని నగ్న దృశ్యాలా?... ఏడుపు వచ్చిందని వాపోయిన కుబ్రా సైత్!

  • 'శాక్రిడ్ గేమ్స్' పేరిట నిర్మితమైన వెబ్ సిరీస్
  • హాట్ హాట్ గా నటించిన కుబ్రా సైత్
  • పదేపదే నగ్నంగా నటించాలని అడిగారంటూ విమర్శలు

'శాక్రిడ్ గేమ్స్' పేరిట నిర్మితమైన వెబ్ సిరీస్ లో హాట్ హాట్ గా నటించిన కుబ్రా సైత్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై సంచలన విమర్శలు చేసింది. సీన్ బాగా రాలేదంటూ, తనను మరోసారి న్యూడ్ గా కనిపించాలని చెబుతూ పదే పదే ఆయన కోరాడని, దీంతో తనకు ఏడుపు వచ్చిందని వాపోయింది.

"నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావని తెలుసు. సీన్ మరింత బాగా రావాలంటే, మరోసారి న్యూడ్ గా కనిపించాలి. అలా చేయాల్సిందే. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. కానీ వెబ్ సిరీస్ బయటకు వచ్చాక, నన్ను అందంగా తీశారని అంటావు" అని కశ్యప్ తనతో చెప్పేవారని తెలిపింది.

అయితే, పదేపదే నగ్న దృశ్యాలు తీస్తుండటం, షాట్ మీద షాట్ అలాగే నటించాల్సి రావడంతో తాను చాలాసార్లు ఏడ్చానని చెప్పింది.  దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ముంబైలో గ్యాంగ్ స్టర్స్, పోలీసుల మధ్య దాడులు, ఎన్ కౌంటర్ల నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందుతుండగా, అలీఖాన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, రాధికా ఆప్టే తదితరులు ఇందులో నటించారు.

More Telugu News