Thailand: గుహలో చిక్కుకుపోయిన థాయ్ ఆటగాళ్లను కాపాడిన ఉదంతంపై రూ. 400 కోట్లతో హాలీవుడ్ సినిమా!

  • ప్రకటించిన ప్యూర్ ఫ్లిక్స్ ఎంటర్ టెయిన్ మెంట్
  • హక్కుల కోసం చూస్తున్నానన్న సీఈఓ మైఖేల్ స్కాట్
  • కథలో ధైర్యం, హీరోయిజం ఉన్నాయని వెల్లడి

థాయ్ లాండ్ గుహలో చిక్కుకుపోయి, ఆర్నెల్లు అక్కడే ఉండాలని తొలుత భావించినా, నాటకీయ పరిణామాల మధ్య వారంతా బయటకు రావడం, మధ్యలో వారికి సాయపడేందుకు వెళ్లిన డైవర్ మరణించడం, గుహలో చిక్కుకుపోయి, మట్టి నీరు తాగడం, దట్టమైన అడవి మధ్యలో భయంకరమైన గుహ, చుట్టూ నీరు, చిమ్మ చీకటి, గంటల తరబడి గుహలో ప్రయాణం, భారీ వర్షాలు... ఓ హాలీవుడ్ కథకు ఇంతకన్నా ఇంకేం కావాలి? ధాయ్ లాండ్ ఫుట్ బాల్ జూనియర్ టీమ్ రెస్క్యూ కథను ఆంగ్ల చిత్రంగా మలచాలని ప్యూర్ ఫ్లిక్స్ ఎంటర్ టెయిన్ మెంట్ నిర్ణయించింది.

 కావోస్ ఎంటర్ టెయిన్ మెంట్ కు చెందిన ఆడమ్ స్మిత్ తో కలసి తాను ఈ చిత్రాన్ని నిర్మించతలచానని, ఇందుకు రూ. 400 కోట్ల వరకూ (సుమారు 60 మిలియన్ డాలర్లు) వెచ్చిస్తానని ప్యూర్ ఫ్లిక్స్ ఎంటర్ టెయిన్ మెంట్ సీఈఓ మైఖేల్ స్కాట్ తన ఫేస్ బుక్ ఖాతాలో ప్రకటించారు. ఈ వాస్తవ కథ హక్కులను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ఈ కథలో సాహసం, హీరోయిజం ఉన్నాయని, దాన్ని తాను స్పష్టంగా గమనించానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తాను 90 మంది డైవర్లతో మాట్లాడానని అన్నారు. ఇది కేవలం సినిమా కాదని, ఈ సాహస కార్యంలో పాల్గొని మరణించిన డైవర్ సహా ప్రతి ఒక్కరికీ నివాళిగా ఈ చిత్రం తీస్తానని చెప్పుకొచ్చారు.

More Telugu News