BSNL: బీఎస్ఎన్ఎల్ నుంచి ఇంటర్నెట్ టెలీఫోనీ సేవలు.. దేశంలోనే తొలిసారి!

  • వింగ్స్ యాప్‌ను ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్
  • దీని ద్వారా దేశంలోని ఏ నంబరుకైనా ఫోన్ చేసుకునే సౌకర్యం
  • అభినందించిన టెలికం మంత్రి మనోజ్ సిన్హా

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) దేశంలో తొలిసారి ఇంటర్నెట్ టెలీఫోనీ సేవలను ప్రారంభించింది. ఇందు‌కోసం ప్రత్యేకంగా ‘వింగ్స్’ పేరుతో మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా దేశంలోని ఏ మొబైల్ నంబరుకైనా ఫోన్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఇటువంటి యాప్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, కాల్ అందుకునే వారికి కూడా ఆ సేవలు ఉన్నప్పుడే అది సాధ్యమయ్యేది. అయితే, ‘వింగ్స్’ ద్వారా దేశంలోని ఏ మొబైల్ నంబరుకైనా కాల్ చేసుకోవచ్చు.
 
వింగ్స్ సేవలను ప్రారంభించిన అనంతరం టెలికం మంత్రి మనోజ్ సిన్హా మాట్లాడుతూ.. ఇంటర్నెట్ టెలీఫోనీ సేవలను ప్రారంభించినందుకు బీఎస్ఎన్ఎల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో బీఎస్ఎన్ఎల్ తన మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నందుకు అభినందనలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ సేవల వల్ల సిమ్ అవసరం లేకుండానే యూజర్లు కాల్ చేసుకోవచ్చు.  బీఎస్ఎన్ఎల్, లేదంటే ఇతర పబ్లిక్ వై-పై సేవలను ఉపయోగించుకోవడం ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. ఈ సేవల కోసం ఈ వారంలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని, 25వ తేదీ నుంచి సేవలు ప్రారంభం అవుతాయని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

More Telugu News