nitin gadkari: 'పోలవరానికి నిధుల కొరత లేదు'.. చంద్రబాబుతో కలిసి మీడియా సమావేశంలో నితిన్‌ గడ్కరీ

  • ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర సర్కారు దృఢ నిశ్చయంతో ఉంది
  • ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతోంది
  • ఫిబ్రవరి నాటికి సివిల్‌ వర్క్స్‌ పూర్తి చేయాలి 
  • ముందస్తు నిధులు ఇవ్వాలని చంద్రబాబు అడిగారు

ఆంధ్రప్రదేశ్‌ రైతులకు పోలవరం ప్రాజెక్టు కొత్త జీవితాన్ని ఇస్తుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. దీన్ని పూర్తి చేయడానికి కేంద్ర సర్కారు దృఢ నిశ్చయంతో ఉందని, ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతోందని చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి ఆ ప్రాజెక్టు పనులను నితిన్‌ గడ్కరీ పరిశీలించారు.

అనంతరం నితిన్‌ గడ్కరీ, చంద్రబాబు సంయుక్తంగా మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. ఫిబ్రవరి నాటికి సివిల్‌ వర్క్స్‌ పూర్తి చేయాలని తాను సంబంధిత అధికారులకు సూచించానని అన్నారు.

  పోలవరానికి నిధుల కొరత లేదని అన్నారు. ముందస్తు నిధులు ఇవ్వాలని చంద్రబాబు అడిగారని, ఈ విషయంపై ఆర్థిక శాఖతో చర్చిస్తానని అన్నారు. సహాయ, పునరావాసాల్లో గిరిజన ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. నీటి సదుపాయం ఉంటే ఎంత మేలు జరుగుతుందో ఓ రైతుగా తనకు తెలుసని అన్నారు. 

More Telugu News