Kathi Mahesh: కత్తి మహేశ్, స్వామి పరిపూర్ణానందలను బహిష్కరించి అపవాదు మూటకట్టుకున్నారు: జెరూసలేం మత్తయ్య

  • కత్తి వ్యాఖ్యలకు దళిత వర్గాల తరపున నేను సారీ చెబుతున్నా
  • కత్తి మహేశ్ పై బహిష్కరణను ఎత్తివేయాలి
  • మాట్లాడిన ప్రతిఒక్కరినీ ఇలా బహిష్కరిస్తామంటే కుదరదు

వ్యక్తుల మనోభావాలు కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ ను ఆరు నెలల పాటు హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తూ నగర పోలీసులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జెరూసలేం మత్తయ్య స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీవీ డిబేట్ లో భాగంగానే కత్తి మహేశ్  అలా మాట్లాడారని, ఇందుకు హిందూ సమాజం ఆయన్ని టార్గెట్ చేయడం కరెక్టు కాదని అన్నారు. 

కత్తి మహేశ్ పై విధించిన హైదరాబాద్ నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కత్తి మహేశ్, స్వామి పరిపూర్ణానందలని నగర బహిష్కరణ చేసిన డీజీపీ పెద్ద అపవాదు మూటకట్టుకున్నారని విమర్శించారు. కత్తి మహేశ్ మాట్లాడిన మాటలకు దళిత వర్గాల తరపున తాను క్షమాపణలు చెబుతున్నానని, పరిపూర్ణానందస్వామి కూడా ఇతర మతస్థుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారని, డీజీపీకి తెలియకపోతే న్యాయవాదుల సలహా తీసుకోవాలని విమర్శించారు. మాట్లాడిన ప్రతిఒక్కరినీ ఇలా బహిష్కరిస్తామంటే కుదరదని అన్నారు.

More Telugu News