ahmed shehzad: డోపింగ్ టెస్ట్ లో దొరికిన మరో పాకిస్థాన్ క్రికెటర్.. నిషేధం విధించే అవకాశం

  • నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిన అహ్మద్ షెహజాద్
  • నోటీసులు జారీ చేసిన పాక్ క్రికెట్ బోర్డు
  • ఐసీసీ నిబంధనల ప్రకారం అన్ని ఫార్మాట్ల నుంచి నిషేధం విధించే అవకాశం

నిషేధిత ఉత్ప్రేరకాలు వాడుతూ దొరికిపోతున్న పాకిస్థాన్ క్రికెటర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా అహ్మద్ షెహజాద్ డోప్ టెస్టులో దొరికిపోయాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ అతనికి నోటీసులు జారీ చేసింది.

పాకిస్థాన్ లో నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లోనే షెహజాద్ నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు రుజువైందని... కానీ, భారత్ లోని ల్యాబ్ కు పంపి మరోసారి నిర్ధారించుకుందని ప్రముఖ పాకిస్థాన్ పత్రిక డాన్ తెలిపింది. ఐసీసీ నిబంధనల మేరకు ఏ ఫార్మాట్ క్రికెట్ ఆడకుండా షెహజాద్ పై నిషేధం విధించే అవకాశం ఉంది. గతంలో డోప్ టెస్టులో విఫలమైన లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజా హసన్ రెండేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. అబ్దుల్ రెహమాన్, యాసిర్ షాలు తాత్కాలిక నిషేధాలను ఎదుర్కొన్నారు.

More Telugu News