Robo: ఎట్టకేలకు '2.0' రిలీజ్ డేట్ చెప్పేసిన శంకర్!

  • వీఎఫ్ఎక్స్ షాట్స్ డెలివరీ డేట్ వచ్చేసిందట
  • నవంబర్ 29న విడుదలకు సిద్ధం
  • ట్విట్టర్ లో వెల్లడించిన దర్శకుడు శంకర్

కోట్లాదిమంది రజనీకాంత్ అభిమానులు ఎదురు చూస్తున్న రోజు ఎప్పుడు రానుందో తెలిసిపోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '2.0' చిత్రం ఈ సంవత్సరం నవంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల తేదీని శంకర్, చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్‌ 29న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అటు శంకర్, ఇటు లైకా ప్రొడక‌్షన్స్‌ ఈ విషయాన్ని పంచుకున్నారు.

 "హాయ్ ఎవ్రీవన్... చిట్టచివరికి వీఎఫ్ఎక్స్ కంపెనీలు వీఎఫ్ఎక్స్ షాట్స్ డెలివరీ డేట్ ను ఎనౌన్స్ చేశాయి. ఈ సినిమా నవంబర్ 29న విడుదల కానుంది" అని శంకర్ ట్వీట్ చేశారు. సూపర్ హిట్ చిత్రం 'రోబో'కు సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా నటించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. సినిమాలో గ్రాఫిక్ వర్క్ అధికంగా ఉన్న కారణంగా ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది.

More Telugu News