Andhra Pradesh: సులభతర వాణిజ్య విధానం ర్యాంకులు విడుదల.. దేశంలోనే ఏపీకి అగ్రస్థానం

  • తెలంగాణకి రెండో స్థానం
  • తరువాతి స్థానాల్లో వరుసగా హర్యానా, జార్ఖండ్‌, గుజరాత్‌
  • గత ఏడాది అగ్రస్థానాన్ని పంచుకున్న తెలుగు రాష్ట్రాలు

సులభతర వాణిజ్య విధానంలో తెలుగు రాష్ట్రాలు మరోసారి సత్తా చాటాయి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానం దక్కించుకుంది. ఈరోజు ఢిల్లీలో డీఐపీపీ కార్యదర్శి రమేశ్‌ అభిషేక్‌ ఈ ర్యాంకులను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల తరువాతి స్థానాల్లో వరుసగా హర్యానా, జార్ఖండ్‌, గుజరాత్‌, చత్తీస్‌గఢ్‌,  మధ్య ప్రదేశ్‌, కర్ణాటక ఉన్నాయి. గత ఏడాది ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఒకే రకంగా స్కోరు సాధించి ఇరు రాష్ట్రాలు అగ్రస్థానాన్ని పంచుకున్న విషయం తెలిసిందే.  

More Telugu News