airplane: నాలుగు రోజుల మెగాసేల్‌.. అతి తక్కువ ధరకే ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రయాణం

  • ఇండిగో ఎయిర్‌లైన్స్‌ 12వ వార్షికోత్సవం 
  • సుమారు 12 లక్షల సీట్లకు టిక్కెట్లు
  • టిక్కెట్ల ప్రారంభ ధర రూ.1,212

విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ భారీ ఆఫర్‌ ప్రకటించింది. తమ సంస్థ సర్వీసులు అందిస్తోన్న అన్ని మార్గాల్లో ప్రయాణించేవారు సుమారు 12 లక్షల సీట్లను అతి తక్కువ ధరకే పొందవచ్చని తెలిపింది. తమ సంస్థ 12వ వార్షికోత్సవం సందర్భంగా అందిస్తోన్న ఈ నాలుగు రోజుల మెగాసేల్‌లో టిక్కెట్ల ప్రారంభ ధర రూ.1,212గా ఉంటుందని, ఈ నెల 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకూ చేసే ప్రయాణాలకు నేటి నుంచి జులై 13 వరకు బుకింగ్స్ చేసుకోవచ్చని పేర్కొంది.

దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేయొచ్చని తెలిపింది. అంతేగాక, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో బుకింగ్‌ చేసుకునేవారు క్యాష్‌బాక్‌ కూడా పొందవచ్చని, ఇందుకోసం కనీసం రూ.3000తో బుకింగ్‌ చేసుకోవాలని పేర్కొంది.  

More Telugu News