sexual abuse: కోడలిపై లైంగిక వేధింపులు.. మామ అరెస్ట్!

  • జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పని చేసి, రిటైర్ అయిన నిందితుడు
  • మూడు నెలలుగా కోడలిపై లైంగిక వేధింపులు
  • నిన్న రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు

కోడలిని కూతురుగా చూసుకోవాల్సిన మామ... ఆమె పట్ల కాలయముడిగా మారాడు. లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ అంబర్ పేటలో నివసిస్తున్న ఓ వ్యక్తి (59) ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పని చేసి రిటైర్ అయ్యాడు. గత మూడు నెలలుగా కోడలు(30)ని లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడు.

ఈ క్రమంలో గత ఆదివారం కూడా ఆమెపై కర్రతో దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు ఆమెను కాపాడారు. నిన్న ఉదయం తన స్వగ్రామం జనగామకు వెళ్లిన ఆమె... మధ్యాహ్నం మళ్లీ తిరిగి వచ్చింది. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో, నిందితుడిని నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News