Nirbhaya: 'నిర్భయ' అత్యాచారం కేసులో మైనర్ ఎక్కడున్నాడో తెలియట్లేదన్న కేంద్ర ప్రభుత్వం!

  • 2016లో బాల నేరస్తుల శిక్షణాలయం నుంచి బయటకు
  • ఆపై ఎక్కడున్నాడో వివరాలు లేవన్న మహిళా, శిశు సంక్షేమ శాఖ
  • పేరును మార్చుకున్నట్టు చెబుతున్న అధికారులు

2012 నాటి నిర్భయ అత్యాచారం కేసులో దోషిగా నిరూపితుడైన బాల నేరస్తుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని కేంద్రం వెల్లడించింది. ఈ కేసులో నిన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత స్పందించిన కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ, ఆ మైనర్ బాలుడు ఎక్కడ ఉన్నాడన్న విషయం తెలియడం లేదని అన్నారు.

బాల నేరస్తుల శిక్షణాలయంలో మూడేళ్ల శిక్షను అతను అనుభవించాడని గుర్తు చేసిన ఆమె, ఆపై అతని జాడలు తెలియలేదని చెప్పారు. దేశవ్యాప్తంగా లైంగిక నేరాలకు పాల్పడినవారి డేటాబేస్ ను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాగా, ఆ బాల నేరస్తుడు 2016లో తన పేరును మార్చుకున్నాడని, ఢిల్లీకి దూరంగా వెళ్లిపోయి ఓ ఎన్జీవో సంస్థ సహకారంతో రహదారి పక్కనున్న చిన్న హోటల్ లో పనికి కుదిరాడని తెలుస్తోంది.

More Telugu News