శిలువపై నన్ను ఉరి తీస్తే.. ఓట్లు రాలతాయనేది ఎన్డీయే ఆలోచన: విజయ్ మాల్యా

- భారత ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం నన్ను వెంటాడుతోంది
- బకాయిలు చెల్లించడానికి రూ. 13,900 కోట్ల ఆస్తులు కుదువపెట్టా
- త్వరలోనే బ్యాంకుల లావాదేవీలన్నీ పూర్తి చేస్తా
ఈ నేపథ్యంలో మాల్యా మాట్లాడుతూ, ఎప్పుడో తన తండ్రి తనకు రాసిచ్చిన ఆస్తులను కూడా తీసేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమ తీసుకుని తమరు తన వద్దకు రావడమెందుకని... తానే వచ్చి ఆస్తులను అందజేస్తానని బ్రిటీష్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు తాను చెప్పానని తెలిపారు. బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం.... రూ. 13,900 కోట్ల విలువైన తన ఆస్తులను కుదువపెట్టానని... బ్యాంకులతో ఉన్న లావాదేవీలన్నింటినీ పూర్తి చేస్తానని చెప్పారు. లండన్ శివార్లలో నాలుగు ఇళ్లు మాల్యా పిల్లల పేరిట ఉన్నాయి. దీనికి తోడు, అత్యంత విలాసవంతమైన ఓ భవనాన్ని తల్లి పేరిట పెట్టారు. ఇదంతా వ్యూహాత్మకంగానే చేసినట్టు భావిస్తున్నారు.