Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నూతన దర్శకుడి చిత్రంలో సమంత
  • 'ఎన్టీఆర్' బయోపిక్ లో మురళీశర్మ 
  • ముగ్గురు యంగ్ హీరోల చిత్రం 
  • 'సైరా'లో కీలక పాత్రలో 'ఈగ' సుదీప్  

 *  అందాలతార సమంత ఓ నూతన దర్శకుడి చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. 'అర్జున్ రెడ్డి' చిత్రానికి అసోసియేట్ గా పనిచేసిన గిరీశయ్య దర్శకత్వంలో రూపొందే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించడానికి ఈ చిన్నది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
*  బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. ఎన్టీఆర్ జీవితంలో వివిధ దశలలో తారసపడే పలువురి ప్రముఖుల పాత్రల కోసం ప్రముఖ నటులను తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత చక్రపాణి పాత్రకు గాను మురళీశర్మను ఎంచుకున్నారు. ఈ విషయాన్ని మురళీశర్మ వెల్లడించాడు.
*  ముగ్గురు యంగ్ హీరోలతో తెలుగులో ఓ చిత్రం రూపొందుతోంది. నారా రోహిత్, సుదీర్ బాబు, శ్రీ విష్ణు కలసి నటిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఇంద్రసేన దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శ్రియ కథానాయికగా నటిస్తోంది.
*  మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'సైరా' చిత్రం షూటింగ్ హైదరాబాదు శివారులో వేసిన సెట్స్ లో కొనసాగుతోంది. ఇందులో ఓ కీలక పాత్రకు తాజాగా 'ఈగ' ఫేం సుదీప్ ను తీసుకున్నారు.

More Telugu News