ttd: టీటీడీపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న సుబ్రహ్మణ్యస్వామి

  • 19న సుప్రీంలో పిటిషన్ వేయనున్న స్వామి
  • రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ నుంచి టీటీడీకి విముక్తి కలిగించడమే లక్ష్యం
  • టీటీడీ నిర్వహణను సాధువులకు అప్పగించాలని గతంలోనే చెప్పిన స్వామి

గత కొంతకాలంగా టీటీడీలో అలజడి చెలరేగుతున్న సంగతి తెలిసిందే. స్వామివారి పింక్ డైమండ్ ను మాయం చేశారని, నిధుల కోసం తవ్వకాలు చేపట్టారంటూ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీటీడీలో నెలకొన్న వివాదాలపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

 ఈ నెల 19న పిటిషన్ వేస్తానని ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం నియంత్రణ నుంచి టీటీడీని తొలగించాలన్నదే స్వామి పిటిషన్ సారాంశమని తెలుస్తోంది. స్వామి వారి ఆభరణాల మాయంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని గతంలోనే స్వామి డిమాండ్ చేశారు. దేవాలయ నిర్వహణను సాధువులకు అప్పగించాలని... లేకపోతే లూటీ ఇలాగే కొనసాగుతుందని చెప్పారు. 

More Telugu News