Moon Eclipse: ఈ నెలలో రెండు ఖగోళ వింతల దర్శనం!

  • 27న సంపూర్ణ చంద్రగ్రహణం
  • 1.43 గంటల పాటు కొనసాగనున్న గ్రహణం
  • 31న అతి దగ్గరకు రానున్న అంగారకుడు

ఈ నెలాఖరులో ఐదు రోజుల వ్యవధిలో రెండు ఖగోళ వింతలు చోటు చేసుకోనున్నాయి. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘంగా, 27వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం 1 గంటా 43 నిమిషాల పాటు కొనసాగనుండగా, ఆపై 31వ తేదీన అంగారక గ్రహాన్ని భూమిపై నుంచి స్పష్టంగా చూసే అవకాశం లభించనుంది. 27న రాత్రి 11.54 గంటల తరువాత సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీన్ని భారత్ లోని ఎక్కడి నుంచైనా వీక్షించవచ్చు.

 ఆపై 2003 తరువాత ఇప్పుడు అంగారకుడు భూమికి 5.76 కోట్ల కిలోమీటర్ల దగ్గరికి రానున్నాడు. 2003లో 60 వేల సంవత్సరాల తరువాత 5.57 కోట్ల కిలోమీటర్ల దగ్గరికి వచ్చి వెళ్లిన అంగారకుడు, ఈ దఫా ఇంకాస్త దూరంలో కనిపించనున్నాడు. దీన్ని 31వ తేదీ సూర్యాస్తమయం తరువాత ఎప్పుడైనా వీక్షించవచ్చు. టెలిస్కోప్ అవసరం లేకుండానే అంగారకుడుని చూడవచ్చని, ఓ సాధారణ టెలిస్కోపుతో చూస్తే ఆ గ్రహంపై ఉండే మంచు ఫలకాలు కూడా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. తూర్పు ఆగ్నేయ దిశలో అంగారకుడు కనిపిస్తాడని, మళ్లీ 2035లోనే అంగారకుడిని స్పష్టంగా చూసే అవకాశం లభిస్తుందని తెలిపారు.

More Telugu News