Godavari: కాళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి!

  • ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు
  • నదిలో 7 మీటర్ల ఎత్తునకు చేరిన నీరు
  • ఆగిన ప్రాజెక్టుల పనులు

మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ ప్రాంతాలతో పాటు ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరికి భారీగా వరదనీరు వస్తోంది. ఈ ఉదయం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా, నదిలో నీరు 7 మీటర్ల ఎత్తులో గోదావరి తీరం మెట్లను తాకుతూ ప్రవహిస్తోంది.

వరద కారణంగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పనులకు ఆటంకం కలుగగా, పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. తిరిగి వరద తగ్గిన తరువాతనే పనులు చేపడతామని పేర్కొన్నారు. కాగా, వర్షాకాలం ప్రారంభం కావడం, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో, మరో నాలుగైదు నెలల పాటు కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం పనులకు బ్రేక్ ఇవ్వక తప్పదని తెలుస్తోంది.

More Telugu News