Canada: యాక్సిడెంట్ లో మరణించిన కెనడా జూనియర్ హాకీ టీమ్ ఆటగాళ్లు... ప్రమాదానికి కారకుడైన ఎన్నారై అరెస్ట్!

  • కెనడాలో డ్రైవర్ గా పనిచేస్తున్న జస్ క్రీత్ సింగ్ సిద్ధూ
  • హాకీ ఆటగాళ్ల బస్సు ప్రమాదంలో 16 మంది మృతి
  • గరిష్ఠంగా 14 ఏళ్లు శిక్ష పడే అవకాశం

కెనడా క్రీడా చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా నిలిచిన కేసులో ప్రవాస భారతీయ ట్రక్ డ్రైవర్, 29 సంవత్సరాల జస్ క్రీత్ సింగ్ సిద్ధూను రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్సీఎంపీ) విభాగం అరెస్ట్ చేసింది. కెనడా జూనియర్ హాకీ టీమ్ ప్రయాణిస్తున్న బస్సును జస్ క్రీత్ నడుపుతున్న ట్రక్ ఢీ కొట్టగా ప్రమాదం జరిగి, 16 మంది చనిపోయారు. వీరిలో అత్యధికులు యువ ఆటగాళ్లు, వారి సహాయకులే. జస్ క్రీత్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన కారణంగానే ప్రమాదం జరిగిందని తేలడంతో, ఆయన్ను అరెస్ట్ చేసి, కస్టడీకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

ఈ కేసును సస్కచేవాన్ ప్రావిన్స్ కోర్టు వచ్చే వారంలో విచారించనుండగా, నిందితుడికి కెనడా చట్టాల ప్రకారం గరిష్ఠంగా 14 సంవత్సరాల వరకూ శిక్షపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ ఆరున ఈ ప్రమాదం జరిగింది. సిద్ధూకు ఎటువంటి గాయాలూ కాలేదు. 2008 నుంచి 2012 మధ్య కాలంలో చండీగఢ్ లోని పంజాబ్ యూనివర్శిటీలో కామర్స్ విద్యను అభ్యసించిన సిద్ధూ, ఆపై కెనడాకు వెళ్లి, కాల్గరీ కేంద్రంగా పని చేస్తున్న ఆదేశ్ డియాల్ ట్రక్కింగ్ లిమిటెడ్ లో డ్రైవర్ గా చేరాడు.

More Telugu News