Gangster: గ్యాంగ్‌స్టర్ మున్నా బజరంగీ దారుణ హత్య.. జైల్లోనే కాల్చేసిన ప్రత్యర్థి!

  • జైలులోనే మున్నాను కాల్చి చంపిన ప్రత్యర్థి
  • బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో మున్నా నిందితుడు
  • నేడు కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండగా ఘటన

మాఫియా డాన్ మున్నా బజరంగీ అలియాస్ ప్రేమ్ ప్రకాశ్ ఈ ఉదయం జైల్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. బీఎస్పీ ఎమ్మెల్యే కేసులో నిందితుడైన ఆయనను ఉత్తరప్రదేశ్ ‌లోని భాగ్‌పట్‌ జైలులో కాల్చి చంపారు. సోమవారం ఉదయం 6:30 గంటల సమయంలో జైలులో ఆయన ప్రత్యర్థి సునీల్ రాఠీ పిస్టల్‌తో కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు.

బజరంగీకి రాజకీయ వేత్తగా మారిన డాన్ ముక్తార్ అన్సారీతోనూ సంబంధాలున్నాయి. బజరంగీని ఆయనకు కుడిభుజంగా చెబుతారు. కాగా, ఇటీవల బజరంగీ భార్య మాట్లాడుతూ తన భర్తను హత్య చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో కోర్టులో ప్రవేశపెట్టేందుకు బజరంగీని గత రాత్రే ఝాన్సీ నుంచి భాగ్‌పట్ తీసుకొచ్చారు. ఉదయం అతడిని కాల్చి చంపడం కలకలం రేపుతోంది.

మున్నాబజరంగీ ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడు.2005లో జరిగిన  బీఎస్పీ ఎమ్మెల్యే కృష్ణానంద్ హత్య కేసులో 2009 నుంచి జైలులో ఉంటున్నాడు. కృష్ణానంద్‌ హత్య సమయంలో మున్నా, అతడి గ్యాంగ్ సభ్యులు ఆరు ఏకే 47 తుపాకులతో ఏకంగా 400 రౌండ్ల కాల్పులు జరిపారు.

More Telugu News