Nitish kumar: మోదీతోనే నితీశ్ కుమార్.. కుదిరిన ఏకాభిప్రాయం.. లోక్ సభ ఎన్నికల్లో కలిసే పోటీ!

  • సీట్ల పంపకం విషయంలో ఇరు పార్టీల మధ్య అంగీకారం
  • బీజేపీ కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేయనున్న జేడీయూ
  • ఎన్డీయేతోనే వెళ్తామన్న జేడీయూ

బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్టీయేతో కలిసి ఉంటారా? కాంగ్రెస్ మహాకూటమి వైపు వెళ్తారా? అన్న సస్పెన్స్ ‌కు తెరపడింది. లోక్‌సభ సీట్ల పంపకం విషయంలో  బీజేపీ-జేడీయూ మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఢిల్లీలో ఆదివారం జరిగిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం జేడీయూ ఓ ప్రకటన చేస్తూ 2019 లోక్ ‌సభ ఎన్నికల్లో బీజేపీతోనే వెళ్లనున్నట్టు తెలిపింది. అలాగే కేంద్రం ప్రతిపాదిస్తున్న ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’కు కూడా మద్దతు ప్రకటించింది.

ఆదివారం జరిగిన సమావేశంలో బీజేపీకి తమ కంటే ఎక్కువ సీట్లు ఇవ్వలేమని చెప్పి వారిని ఒప్పించారు. రాష్ట్రంలో తమకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న కారణంగా ఎక్కువ సీట్లు కేటాయించలేమని స్పష్టం చేశారు. బీజేపీ కంటే ఎక్కువ సీట్లలోనే జీడీయూ పోటీ చేస్తుందని ఆ పార్టీ అగ్రనాయకత్వం తేల్చి చెప్పింది. బీజేపీ కూడా ఇందుకు అంగీకరించడంతో ఇన్నాళ్లూ ఇరు పార్టీల నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధానికి తెరపడినట్టే. అయితే, ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనే విషయం ప్రకటించనప్పటికీ, బీజేపీకి 17 సీట్లు ఇచ్చేందుకు జేడీయూ అంగీకరించినట్టు తెలిసింది.

More Telugu News