Shruti: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'నేను చాలా లక్కీ' అంటున్న శ్రుతి హాసన్ 
  • 'ఎఫ్ 2'లో జాయిన్ అవుతున్న వెంకటేశ్ 
  • 'గజదొంగ'గా వస్తున్న సప్తగిరి
  • సుకుమార్ దర్శకత్వంలో హిందీ చిత్రం

 *  'నేను చాలా లక్కీ' అంటోంది అందాలభామ శ్రుతిహాసన్. "మామూలుగా చాలా మందిలో నటన, లేదా మ్యూజిక్ .. ఏదో ఒకటే టాలెంట్ వుంటుంది. భగవంతుడు మాత్రం నాకు రెండూ ఇచ్చాడు. ఆ విధంగా అదృష్టవంతురాలిని' అని చెప్పింది.
*  అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ రూపొందుతున్న సంగతి విదితమే. 'ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' (F 2) పేరిట రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతోంది. నేడు వెంకటేశ్ కూడా ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతున్నారు. వెంకీ సరసన తమన్నా, వరుణ్ సరసన మెహ్రీన్ ఇందులో జంటగా నటిస్తున్నారు.
*  ప్రముఖ హాస్య నటుడు సప్తగిరి మరోసారి హీరోగా రానున్నాడు. నూతన దర్శకుడు డి.రామకృష్ణ దర్శకత్వం వహించే 'గజదొంగ' అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. వినోదాత్మకంగా సాగే ఈ యాక్షన్ కథా చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది.
*  ఇటీవల 'రంగస్థలం' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు సుకుమార్ హిందీలో ఓ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. వరుణ్ ధావన్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం.

More Telugu News