Yatra: "ఈ పాదయాత్ర నా మూర్ఖత్వమో, పట్టుదలో... చరిత్రనే నిర్ణయించుకోనీ": అదరగొడుతున్న వైఎస్ బయోపిక్ 'యాత్ర' టీజర్

  • నేడు వైఎస్ఆర్ జయంతి వేడుకలు
  • 'యాత్ర' టీజర్ విడుదల
  • ఇప్పటికే లక్షల్లో వ్యూస్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ 'యాత్ర' టీజర్ విడుదలై అదరగొడుతోంది. మమ్ముట్టి ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ను నేడు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా విడుదల చేశారు. "తెలుసుకోవాలని ఉంది... వినాలనుంది. ఈ కడప దాటి ప్రతీ గడపలోకీ వెళ్లాలని ఉంది. వాళ్లతో కలిసి నడవాలనుంది. వాళ్ల గుండెచప్పుడు వినాలనుంది. గెలిస్తే పట్టుదలంటారు... ఓడిపోతే మూర్ఖత్వమంటారు. ఈ పాదయాత్ర నా మూర్ఖత్వమో, పట్టుదలో... చరిత్రనే నిర్ణయించుకోనీ" అన్న మమ్ముట్టి డైలాగులు ఆకర్షిస్తున్నాయి.

ఆపై 'వైఎస్ఆర్... వైఎస్ఆర్' అన్న నినాదాల మధ్య మమ్ముట్టి, తన ఎడమ చేత్తో కార్యకర్తలకు అభివాదం చేయడం కనిపిస్తోంది. ఈ టీజర్ వ్యూస్ ఇప్పటికే వేలు దాటి లక్షల్లోకి వెళ్లిపోయింది. మీరూ ఓ లుక్కేయండి.

More Telugu News