paruchuri: నేనిచ్చిన ఐడియా రాఘవేంద్రరావుకు నచ్చింది.. ఆ షాట్ అలాగే తీశారు!: పరుచూరి గోపాలకృష్ణ

  • అవి 'బొబ్బిలి బ్రహ్మన్న' తీస్తున్న రోజులు 
  • రాఘవేంద్రరావుకి ఒక ఐడియా ఇచ్చాను 
  • అది ఆయనకి బాగా నచ్చింది  

సినీ రచయితగా పరుచూరి గోపాలకృష్ణ ఎన్నో విజయవంతమైన చిత్రాలకి పనిచేశారు. ఆయన రాసిన కథలు .. సమకూర్చిన సంభాషణలు ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అలాంటి గోపాలకృష్ణ తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమం ద్వారా 'బొబ్బిలి బ్రహ్మన్న' సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

'బొబ్బిలి బ్రహ్మన్న' సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు .. మేము ఆ సినిమాకి కథ - మాటలు అందించాం. ఒక సీన్ బాగా తీయడానికి ఆయన ఎంతగా తపన పడిపోతాడనేది నేను ప్రత్యక్షంగా చూశాను. శారద తమ కూతురు గర్భవతి అనే విషయం తెలిసి .. భర్తకి తెలియకుండగా అక్కడికి వెళ్లి వస్తుంది. భయం భయంగా ఇంటికి చేరుకొని తలుపు తోస్తుంది .. ఎదురుగా కృష్ణంరాజు నిలబడి ఉంటాడు. అయితే తలుపు తోయగానే కృష్ణంరాజును చూపించకుండగా .. శారద ఉలిక్కిపడి వెనక్కి అడుగువేయడం చూపిస్తే బాగుంటుందని నేను అన్నాను. ఐడియా బాగుందని చెప్పేసి ఆ షాట్ ను ఆయన అలాగే తీశాడు. అప్పటికి ఇండస్ట్రీకి మేం వచ్చి రెండు మూడేళ్లు అయింది .. అయినా రాఘవేంద్రరావు మా మాటను గౌరవించి అలా తీయడం ఆయన గొప్పతనం" అని చెప్పుకొచ్చారు.                 

More Telugu News