ఫిఫా వరల్డ్ కప్.. సెమీ ఫైనల్స్ కి ఫ్రాన్స్!

- క్వార్టర్ ఫైనల్లో ఉరుగ్వేతో తలపడ్డ ఫ్రాన్స్
- 2-0 తేడాతో ఫ్రాన్స్ విజయం
- రెండు గోల్స్ కొట్టిన వరానే, గ్రీజ్ మన్
మ్యాచ్ నలభయ్యవ నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాడు వరానే తొలి గోల్ చేశాడు. ఫస్టాఫ్ లో 1-0తో ఫ్రాన్స్ ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్ లో కూడా రెండు జట్లూ హోరాహోరీగా పోరాడాయి. 61వ నిమిషంలో ఫ్రాన్స్ క్రీడాకారుడు గ్రీజ్ మన్ గోల్ చేశాడు. దీంతో విజయం వరించింది. ఫిఫా వరల్డ్ కప్ సెమీస్ కు ఫ్రాన్స్ చేరడంతో ఆ దేశస్తుల ఆనందానికి అవధుల్లేవు. కాగా, ఫిఫా వరల్డ్ కప్ లో రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ బ్రెజిల్-బెల్జియం దేశాల మధ్య జరగనుంది.