kalyan dev: చిన్నప్పటి నుంచి నటన పట్ల ఆసక్తి వుంది: కల్యాణ్ దేవ్

  • స్కూల్ డేస్ లో డాన్సులు చేసేవాడిని 
  • కాలేజ్ రోజుల్లో డ్రామాలు వేశాను 
  • డైరెక్టర్ ఎంతో ప్రోత్సహించాడు

కల్యాణ్ దేవ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'విజేత' సినిమా ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించిన విషయాలను ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూలో కల్యాణ్ దేవ్ ప్రస్తావించాడు. "చిన్నప్పటి నుంచి నాకు నటనపట్ల ఆసక్తి ఉండేది. ఇతర కళల పట్ల కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాడిని. స్కూల్ డేస్ నుంచి కూడా సింగింగ్ .. డాన్సింగ్ .. స్కిట్స్ కి సంబంధించిన కాంపిటీషన్స్ లో పాల్గొనేవాడిని.

టీచర్స్ .. పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తూ వుండేవాళ్లు .. ఏదో ఒక ప్రైజ్ తెచ్చుకుంటూ ఉండేవాడిని. అలా కాలేజ్ డేస్ లోను డ్రామాలు వేసేవాడిని. ఇక నటనలో పూర్తిస్థాయి మెళకువలు నేర్చుకోవడం కోసం సత్యానంద్ గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. ఆయన నుంచి నటనకి సంబంధించి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇక మా డైరెక్టర్ ఆశించిన అవుట్ పుట్ ను ఇవ్వగలుగుతున్నానా .. లేదా అనే డౌట్ ఉంటూ వుండేది. 'చాలా బాగా చేశావ్ .. ' అంటూ ఎప్పటికప్పుడు ఆయన నన్ను ప్రోత్సహిస్తూ ఉండటం వలన ఈ సినిమాను చేయగలిగాను" అంటూ చెప్పుకొచ్చాడు.      

More Telugu News