nagarjuna: నాగ్ .. నాని మల్టీస్టారర్ 'దేవదాస్' టైటిల్ పోస్టర్ రిలీజ్

  • శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'దేవదాస్'
  • డాన్ గా నాగ్ .. డాక్టర్ గా నాని 
  • అందరిలో పెరుగుతోన్న ఆసక్తి  

తెలుగు ప్రేక్షకులతో రొమాంటిక్ హీరో అనిపించుకున్న నాగార్జున, ప్రస్తుతం విభిన్నమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ ముందుకెళుతున్నాడు. ఇక అనతికాలంలోనే ఆడియన్స్ తో నాని నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు. అలాంటి ఈ ఇద్దరితో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఒక మల్టీ స్టారర్ మూవీని ప్లాన్ చేశాడు. నాగార్జున డాన్ గా .. నాని డాక్టర్ గా ఈ సినిమాలో కనిపించనున్నారు.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి 'దేవదాస్' అనే టైటిల్ ను రీసెంట్ గా ఖరారు చేశారు .. తాజాగా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నాగ్ డాన్ కనుక ఆయన పేరు 'దేవ' .. నాని పాత్ర పేరు 'దాస్' అయ్యుంటుంది కనుక ఈ సినిమాకి ఈ పేరును ఖరారు చేసి ఉండొచ్చని అనుకోవచ్చు. నాగ్ .. నాని కాంబినేషన్ పైనే ఇప్పటివరకూ ఆసక్తి ఉండేది. ఈ టైటిల్ తో ఈ సినిమాపై అందరిలో మరింత ఆత్రుత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

More Telugu News