kalyan dev: 'విజేత' రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే నిద్రపట్టడం లేదు: చిరూ చిన్నల్లుడు

  • కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత'
  • ఈ నెల 12వ తేదీన విడుదల 
  • తండ్రీకొడుకుల అనుబంధానికి పెద్దపీట  

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా 'విజేత' సినిమా రూపొందింది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ ను కల్యాణ్ దేవ్ మొదలెట్టేశాడు. తాజాగా ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సినిమాను గురించిన విషయాలను పంచుకున్నాడు.

"విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో టెన్షన్ పెరిగిపోతోంది .. ఈ సినిమాను గురించి ఆలోచిస్తుంటే నిద్ర కూడా పట్టడం లేదు. నా కుటుంబ సభ్యులు .. స్నేహితులంతా కూడా ఈ సినిమా అవుట్ పుట్ పట్ల సంతృప్తికరంగా వున్నారు. ఇక ఈ సినిమా చూసిన తరువాత పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.   

More Telugu News