Pakistan: రెండో పెళ్లిని దాచిపెట్టిన 60 మంది నేతలు.. పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ గుర్తింపు!

  • ఈ నెలలో పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు
  • రెండో పెళ్లిన దాచిపెట్టిన వారిలో పలువురు ప్రముఖులు
  • స్క్రూటినీలో విషయం వెలుగులోకి

సార్వత్రిక ఎన్నికలకు పాకిస్థాన్ సన్నద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇలా సమర్పించిన వారిలో 60 మంది నేతలు తమ రెండో పెళ్లి విషయాన్ని దాచిపెట్టినట్టు ఎన్నికల కమిషన్ గుర్తించింది. రెండో పెళ్లి గుట్టును బయటపెట్టని వారిలో ప్రముఖ నేతలు కూడా ఉండడం విశేషం.

‘దునియా న్యూస్’ ప్రకారం.. రెండో వివాహాన్ని దాచిపెట్టిన వారిలో పంజాబ్ ముఖ్యమంత్రి షేబాజ్ షరీఫ్, ఆయన కుమారుడు హమ్జా షేబాజ్, మాజీ ప్రతిపక్ష నేత ఖుర్షీద్ షా, ఎంక్యూఎం-పీ చీఫ్ ఫరూక్ సత్తార్, రైల్వే శాఖ మాజీ మంత్రి ఖావాజా సాద్ రఫీక్, అర్షాద్ వోహ్రా, పిర్ అమిన్, ఖైసర్ మెహ్‌మూద్, రానా ముబాషార్ తదితరులు ఉన్నారు. నామినేషన్ పత్రాల స్క్రూటినీలో భాగంగా ఈ విషయం వెలుగుచూసింది.

More Telugu News