sensex: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యం
  • 71 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 10,750 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీకి ఈరోజు బ్రేక్ పడింది. వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో, ఆసియా మార్కెట్లన్నీ బలహీనంగానే కొనసాగాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 71 పాయింట్లు పతనమై 35,575కి పడిపోయింది. నిఫ్టీ 20 పాయింట్లు కోల్పోయి 10,750 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (8.97), గతి లిమిటెడ్ (7.07), ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ (6.14), నెట్ వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ (4.83), ఇన్ఫో ఎడ్జ్ ఇండియా (4.76).
 
టాప్ లూజర్స్:
హ్యాథ్ వే కేబుల్ అండ్ డేటాకామ్ (15.40), డెన్ నెట్ వర్క్స్ (10.73), హిందుస్థాన్ కన్స్ స్ట్రక్షన్స్ (8.26), ఐడీబీఐ బ్యాంక్ (6.96), శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ (6.52).

More Telugu News