వొడాఫోన్ ప్రీపెయిడ్ యూజర్లకు శుభవార్త... రూ.499కే అమేజాన్ ప్రైమ్ సభ్యత్వం

- 18-24 ఏళ్ల వయసు వారికే ఈ ఆఫర్
- మై వొడాఫోన్ యాప్ ద్వారా పేమెంట్ చేసి పొందొచ్చు
- ఈ నెల 16లోపు చేసుకుంటే ప్రైమ్ సేల్ లో పాల్గొనే అవకాశం
ప్రైమ్ మెంబర్లకు అమేజాన్ ఉచితంగా సినిమాల కంటెంట్, మ్యూజిక్ ను అందించడంతోపాటు అమేజాన్ డాట్ ఇన్ లో ఉత్పత్తులపై తగ్గింపు ధరలు, వేగంగా డెలివరీ సేవలను అందిస్తోంది. ఈ నెల 16 నుంచి అమేజాన్ 36 గంటల పాటు ప్రత్యేకంగా ప్రైమ్ సేల్ నిర్వహిస్తోంది. ప్రైమ్ మెంబర్ల కోసమే తగ్గింపు ధరలతో అమ్మకాలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో 16వ తేదీలోపే ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకుంటే ప్రైమ్ సేల్ లో పాల్గొనవచ్చని వొడాఫోన్ సూచించింది.