father: అల్లా చెప్పాడట.. భార్య సమక్షంలోనే కూతురుని పెళ్లి చేసుకున్నాడు!

  • 15 ఏళ్ల కుమార్తెను పెళ్లి చేసుకున్న కన్న తండ్రి
  • గర్భం దాల్చిన కుమార్తె
  • పశ్చిమబెంగాల్ లో చోటు చేసుకున్న దారుణం

పశ్చిమబెంగాల్ లోని జల్పాయ్ గురి జిల్లా కసియాజోరా గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. అల్లా చెప్పాడని కన్న కూతురినే పెళ్లి చేసుకున్న ఓ దుర్మార్గుడు... ఆమెను గర్భవతిని కూడా చేశాడు. మరింత బాధాకరమైన విషయం ఏమిటంటే... ఈ తతంగం మొత్తం కన్న తల్లి సమక్షంలోనే జరగడం. 36 ఏళ్ల అఫాజుద్దీన్ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అల్లా ఆదేశించాడంటూ... తన 15 ఏళ్ల కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి ఆయన భార్య సకీనా పూర్తి మద్దతు తెలిపింది. బిడ్డ మంచి కోసమే ఇలా చేస్తున్నానని చెప్పడంతో... ఆమె సరేనంది.

ఈ విషయం తొలుత గ్రామస్తులెవరికీ తెలియదు. అయితే, ఆమె శరీరంలో క్రమంగా మార్పులు వస్తుండటాన్ని కొందరు గ్రహించారు. దీనిపై నిలదీయగా అసలు విషయం బయటపడింది. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో... అఫాజుద్దీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన భర్తను సకీనా వెనకేసుకు రావడం గమనార్హం. తన భర్తకు అల్లాపై ఎనలేని భక్తి ఉందని... ఆయన అబద్ధం చెప్పరని ఆమె తెలిపింది. ఈ దారుణంపై అందరూ మండిపడుతున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది.

More Telugu News