Reliance: లాభాల పర్వం మొదలైంది... గోల్డెన్ డికేడ్ ముందుంది: ముఖేష్ అంబానీ

  • ఏజీఎంలో మాట్లాడిన ముఖేష్ అంబానీ
  • 20.6 శాతం పెరిగిన రిలయన్స్ నెట్ ప్రాఫిట్
  • రూ. 36,075 కోట్లకు నికర లాభం

రిలయన్స్ ఇండస్ట్రీస్ గోల్డెన్ డికేడ్ ఈ సంవత్సరం నుంచి మొదలైందని సంస్థ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు. ముంబైలో సంస్థ ఏజీఎంలో మాట్లాడిన ఆయన, ఇప్పటి వరకూ చవిచూసిన లాభాలు ఒక ఎత్తయితే, ఇకపై కళ్లజూడనున్న లాభాలు మరింతగా ఉంటాయని అన్నారు. నాలుగు దశాబ్దాల తరువాత, ఐదో దశాబ్దంలోకి సంస్థ అడుగు పెట్టిందన్న విషయాన్ని ముఖేష్ గుర్తు చేశారు. గత సంవత్సరం రిలయన్స్ నికర లాభం 20.6 శాతం పెరిగి రూ. 36,075 కోట్లకు చేరిందని అన్నారు. ఈ లాభాల్లో హైడ్రో కార్బన్ విభాగం పనితీరును మరువలేనని ముఖేష్ వ్యాఖ్యానించారు.

సంస్థ సంప్రదాయ ఆదాయ సముపార్జనా విధానం మారిందని, ఆదాయంలో జియో 2 శాతం, రిటైల్ వ్యాపారం 13 శాతం స్థానాన్ని ఆక్రమించాయని అన్నారు. దీంతో ఆదాయం, లాభాలు గణనీయంగా పెరిగాయని వెల్లడించారు. రానున్న దశాబ్ద కాలంలో కన్స్యూమర్ బిజినెస్, పెట్రో కెమికల్ వ్యాపారాలతో పాటు టెలికం రంగం కూడా కీలకమని ముఖేష్ అభిప్రాయపడ్డారు.

More Telugu News