Visakhapatnam District: సెంటరాఫ్ ఎక్సెలెన్స్‌గా మారనున్న విశాఖ మానసిక వైద్యశాల

  • ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.38 కోట్లు
  • రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.9.9 కోట్లు
  • తొలి విడతగా రూ.10 కోట్లు విడుదల

విశాఖపట్టణంలోని ప్రభుత్వ మానసిక వైద్యశాల (జీహెచ్ఎంసీ) త్వరలోనే సెంటరాఫ్ ఎక్స్‌లెన్స్‌గా మారనుంది. ఇందుకోసం ప్రభుత్వం తొలి విడతగా రూ.10 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.38 కోట్లు. ఇందులో రూ. 9.9 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఆ నిధులను టెక్నికల్, నాన్ టెక్నికల్, లైబ్రరీ, స్టాఫ్ సపోర్టు కోసం వినియోగిస్తుంది.

నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (ఎన్ఎంహెచ్‌పీ)లో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేయడంతోపాటు మానసిక వైద్య విభాగంలో ఉన్న వైద్యుల కొరతను తగ్గించనుంది. అలాగే, విభాగాలను పెంచడంతో పాటు సైకియాట్రిక్ నర్సింగ్, సైకియాట్రిక్ సోషల్ వర్క్, క్లినికల్ సైకాలజీ, పీడియాట్రిక్, జెరియాట్రిక్ వార్డులు, ఎక్విప్‌మెంట్, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

ఏపీ మొత్తంలో ఉన్న ఏకైక మానసిక చికిత్సాలయం అయిన జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 300 బెడ్లు ఉన్నాయి. ఏపీతో పాటు వివిధ రాష్టాల నుంచి రోగులు ఇక్కడికి వస్తుంటారు. ఏడాదికి 60 వేల నుంచి 65వేల మంది వరకు చికిత్స కోసం వస్తుంటారు.

More Telugu News