notification: ఏపీలో భాషా పండితుల కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ కు నోటిఫికేష‌న్ విడుద‌ల

  • 31న ఎల్పీసెట్ ప‌రీక్ష‌
  • జూలై 6 నుంచి 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులకు ఆహ్వానం
  • వివరించిన మంత్రి గంటా శ్రీనివాస‌రావు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ పండిట్ శిక్ష‌ణా క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే భాషా పండితుల కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎల్పీసెట్) జూలై 31న జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఈరోజు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. జూలై 6 నుంచి 15 వ‌ర‌కు aplpcet.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో ‌దర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చ‌న్నారు. వెబ్ సైట్ లో అర్హ‌త త‌దిత‌ర వివ‌రాలు వున్నాయ‌ని పేర్కొన్నారు.

ఆన్ లైన్ మిన‌హా మాన్యువల్ గా వ‌చ్చే ద‌ర‌ఖాస్తులను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోమ‌ని స్ప‌ష్టం చేశారు. జూలై 26 నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్‌ చేసుకోవచ్చని, 31న‌ ప‌రీక్ష నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. ఆగ‌ష్టు 1న ఫ‌లితాలు విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. ఆగ‌స్టు 9 నుంచి 11 వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్లు పెట్టుకోవ‌చ్చ‌ని విద్యార్థుల‌కు సూచించారు. ఆగ‌ష్టు 13, 14 తేదీల్లో కౌన్సిలింగ్ వుంటుంద‌ని, అర్హులైన అభ్య‌ర్థులు ఎల్పీసెట్ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. 

More Telugu News