Telugudesam: దేశ వ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత ఏర్పడింది: సీపీఎం మధు

  • టీడీపీ, బీజేపీ, వైసీపీలపై విమర్శలు గుప్పించిన మధు
  • బీజేపీని నిలదీయాల్సిన టీడీపీ రాజకీయ గిమ్మిక్కులు చేస్తోంది
  • టీడీపీ, వైసీపీలు స్వార్థప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయి

టీడీపీ, బీజేపీ, వైసీపీలపై సీపీఎం నేత మధు విమర్శలు గుప్పించారు. విజయనగరంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా బీజేపీపై  వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు. బీజేపీని నిలదీయాల్సిన టీడీపీ, తామే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామంటూ, మరోపక్క బీజేపీని రక్షించాలని చూస్తూ రాజకీయ గిమ్మిక్కులు చేస్తోందని విమర్శించారు.

ఈ సందర్భంగా సీఎం రమేష్ కడపలో చేసిన ఆమరణ నిరాహార దీక్ష గురించి ఆయన ప్రస్తావించారు. కడప దీక్ష తుస్సుమందని ఎద్దేవా చేశారు. విశాఖ రైల్వే జోన్ కోసం తాము పోరాడితే అరెస్టులు చేయించారని, ఇప్పుడేమో టీడీపీ నేతలు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ, వైసీపీలు తమ స్వార్థప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా ఆయన విమర్శలు చేశారు. కేసీఆర్ ఏర్పాటు చేస్తానన్న థర్ఢ్ ఫ్రంట్ సాధ్యం కాదని, అది మధ్యలోనే ఆగిపోయిందని విమర్శించారు.

More Telugu News