Warangal Rural District: వరంగల్‌లో అగ్ని ప్రమాద ఘటనలో 11కి చేరిన మృతులు.. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

  • కోటిలింగాలలో ఓ బాణసంచా గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం
  • కేసీఆర్‌ దిగ్భ్రాంతి
  • గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు  
  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

వరంగల్‌ పరిధిలోని కోటిలింగాలలో ఓ బాణసంచా గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా కుమార్‌ అనే వ్యక్తి భద్రకాళి ఫైర్‌ వర్క్స్‌ పేరిట ఈ వ్యాపారం నిర్వహిస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. కాగా, ఈ ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఆ కుటుంబాలను ఆదుకుంటామని, అలాగే, గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.

More Telugu News