Marriage: పెళ్లి ఖర్చులో కొంత భాగం వధువు పేరిట డిపాజిట్.. సుప్రీం పరిశీలన!

  • భవిష్యత్తులో విభేదాలు రాకూడదనే ఆలోచన 
  • పరిశీలిస్తామన్న అత్యున్నత ధర్మాసనం
  • ఇద్దరు న్యాయమూర్తులతో బెంచ్ ఏర్పాటు

పెళ్లి చేస్తే, వధూవరుల తరఫున ఎంత ఖర్చయిందన్న విషయాన్ని సంబంధిత వివాహ రిజిస్ట్రార్ కు సమర్పించాలన్న విషయాన్ని సుప్రీంకోర్టు పరిశీలించనుంది. జస్టిస్‌ ఆదర్శ్‌ గోయెల్‌, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ లతో ఏర్పాటైన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఈ మేరకు బెంచ్ కు సాయపడాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహను బెంచ్ కోరింది.
 
ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో కట్న కానుకల విషయంలో విభేదాలు తలెత్తకుండా ఉంటుందని సుప్రీం అభిప్రాయపడుతోంది. అంతేకాకుండా, పెళ్లి ఖర్చులో కొంత భాగాన్ని వధువు పేరిట డిపాజిట్ చేయించాలన్న సూచనపైనా విచారిస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. వివాహ వివాదానికి సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీం ఈ విషయాన్ని ప్రస్తావించింది.  

More Telugu News