rana: 180 కోట్ల బడ్జెట్ తో రానా 'హిరణ్యకశిప'

  • గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశిప'
  • నిర్మాతగా సురేశ్ బాబు 
  • భారీ సెట్స్ కి సన్నాహాలు

'రుద్రమదేవి'తో భారీ చారిత్రక చిత్రాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించి ప్రశంసలు అందుకున్న గుణశేఖర్, తన తదుపరి చిత్రంగా 'హిరణ్యకశిప' ఉంటుందని ప్రకటించి చాలా రోజులైంది. ఈ పౌరాణిక సినిమాలో ప్రధానమైన పాత్రను రానా పోషించే ఛాన్స్ ఉందని కూడా ఆయన చెప్పాడు. ఇటీవల ఒక వేదికపై నిర్మాత సురేశ్ బాబు మాట్లాడుతూ, ఈ సినిమాలో రానా చేయబోతున్న విషయాన్ని స్పష్టం చేశాడు. తన బ్యానర్లోనే ఈ సినిమా రూపొందనుందని అన్నాడు.

ఈ సినిమా కోసం 180 కోట్లను ఖర్చు చేయనున్నారనేది తాజా సమాచారం. ప్రముఖ ఆర్టిస్ట్ ముఖేశ్ సింగ్ తో ఈ సినిమాకి అవసరమైన రాజప్రాసాదాలు .. మంటపాలు .. దేవలోకం .. వైకుంఠం .. ఉద్యానవనాలు వంటి సెట్స్ ను గీయిస్తున్నారట. కాస్ట్యూమ్స్ విషయంలోను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గ్రాఫిక్స్ కి కూడా పెద్దపీట వేస్తూ ఈ సినిమాను ఒక విజువల్ వండర్ లా తీర్చిదిద్దడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.  

More Telugu News