china mobile: చైనాకు షాక్ ఇచ్చిన ట్రంప్.. చైనా మొబైల్ సంస్థకు నో ఎంట్రీ!

  • ప్రపంచంలో మూడో అతిపెద్ద సంస్థ చైనా మొబైల్
  • చైనా మొబైల్ సంస్థ దరఖాస్తు తిరస్కరణ 
  • దేశ భద్రత నేపథ్యంలోనే ఈ నిర్ణయమన్న ట్రంప్

అంతర్జాతీయ వాణిజ్యాన్ని, ముఖ్యంగా చైనాను హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా టెలికమ్యూనికేషన్ మార్కెట్ కు ప్రవేశించాలన్న ఉద్దేశంతో చైనా మొబైల్ సంస్థ పెట్టుకున్న దరఖాస్తును అమెరికా తిరస్కరించింది. ఏటీ అండ్ టీ, వెరిజోన్ తర్వాత ప్రపంచంలో ఇదే అతిపెద్ద సంస్థ కావడం గమనార్హం. దేశ భద్రత నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. గత కొన్ని నెలలుగా చైనాపై ట్రంప్ సర్కారు పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చైనా టెక్ కంపెనీలు అమెరికా మేధో సంపత్తిని దొంగిలిస్తున్నాయంటూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చైనా మొబైల్ ఆ దేశ ప్రభుత్వ చెప్పుచేతుల్లో నడుస్తుందని... దీంతో అమెరికాకు భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ట్రంప్ అన్నారు. అమెరికా న్యాయ వ్యవస్థకు కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు, ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చైనా ఇంకా స్పందించలేదు. 

More Telugu News