New Delhi: ఢిల్లీ సామూహిక మరణాల మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు కొత్త వ్యూహం!

  • దేశవ్యాప్తంగా సంచలనమైన బురారీ సామూహిక ఆత్మహత్య
  • మిస్టరీగా మారిన కేసు
  • మానసిక నిపుణుల సాయంతో కేసును ఛేదించే యత్నం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని బురారీ ఆత్మహత్య కేసును ఛేదించేందుకు పోలీసులు సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. మానసిక నిపుణుల సాయం తీసుకోవాలని యోచిస్తున్నారు. సైకలాజికల్ అటాప్సీ నిర్వహించడం ద్వారా మిస్టరీని ఛేదించాలని నిర్ణయించారు. భాటియా కుటుంబం మొత్తం మానసిక రుగ్మతకు గురైందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సునంద పుష్కర్, అరుషి తల్వార్ కేసుల్లోనూ సైకలాజికల్ అటాప్పీ నిర్వహించారు. బురారీ కేసులో దీనిని ఉపయోగించడం ద్వారా ఆత్మహత్యల వెనక నిజంగా ఏమి జరిగిందన్నది నిర్ధారించనున్నారు.  

పోలీసులు ఇప్పటికే విద్యా సాగర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ వైద్యులతో టచ్‌లో ఉన్నారు. సామూహిక ఆత్మహత్యల వెనక ఉన్న కారణాన్ని తెలుసుకుంటున్నారు. భాటియా కుటుంబంలో ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది తమ మానసిక రుగ్మతను మిగతా వారికి వ్యాపింపజేసి ఉంటారని మానసిక వైద్య నిపుణుడు రజత్ మిత్రా తెలిపారు. వారు తమ అభిప్రాయాలను మిగతా వారితో పంచుకోవడం ద్వారా వారిని తమ దారిలోకి తెచ్చుకుని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.  

More Telugu News