సంగీత మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

04-07-2018 Wed 08:41
  • స్మార్ట్ ఫోన్ రిటైల్ చైన్ నిర్వహిస్తున్న సంగీత
  • రెండేళ్ల పాటు ప్రచారకర్తగా కొనసాగనున్న విజయ్
  • డీల్ పై సంతకాలు
దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో స్మార్ట్ ఫోన్ల రిటైల్ చైన్ విక్రయ సంస్థ సంగీత మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా యంగ్ హీరో విజయ్ దేవరకొండ పనిచేయనున్నారు. ఈ మేరకు కంపెనీ ఆయనతో డీల్ కుదుర్చుకుంది. హైదరాబాద్ లోని సెయింట్‌ మేరీస్‌ కాలేజ్ ప్రాంగణంలో అభిమానుల మధ్య సంగీతా మొబైల్స్ తో విజయ్ డీల్ పై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ ఫోన్ భాగమైపోయిందని వ్యాఖ్యానించారు. ఈ డీల్ కుదుర్చుకున్న తరువాత తనపేరు విజయ్ దేవరకొండ బదులు సంగీత దేవరకొండ అయిపోయిందని చమత్కరించాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్‌ చంద్ర మాట్లాడుతూ, ప్రస్తుతం తాము 500 స్టోర్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ బ్రాండ్ ప్రచారకర్తగా విజయ్‌ రెండేళ్ల పాటు కొనసాగుతారని వెల్లడించారు.