Sai Pallavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • క్రీడాకారిణి పాత్రలో సాయిపల్లవి 
  • 'సైరా' రిలీజ్ డేట్ ఖరారు 
  • వచ్చే నెలలో రవిబాబు 'అదుగో'
  • లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో సూర్య 

 *  యువ కథానాయిక సాయిపల్లవి తాజాగా ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తోంది. శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'పడి పడి లేచె మనసు' చిత్రంలో సాయిపల్లవి ఇలా క్రీడాకారిణి పాత్రలో కనిపిస్తుంది.
*  ప్రముఖ నటుడు చిరంజీవి కథానాయకుడుగా స్వాతంత్ర్య వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో రూపొందుతున్న 'సైరా' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి నెలాఖరులో రిలీజ్ చేయడానికి నిర్ణయించినట్టు సమాచారం.
*  నటుడు, దర్శకుడు రవిబాబు రూపొందించిన ప్రయోగాత్మక చిత్రం 'అదుగో' వచ్చే నెల రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓ పందిపిల్లను ప్రధాన పాత్రధారిగా తీసుకుని ఈ చిత్రాన్ని రవిబాబు రూపొందించాడు.
*  ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక చిత్రం, కేవీ ఆనంద్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేస్తున్న సూర్య.. తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పాడు. 'గురు' చిత్రం దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. 

More Telugu News