dubai: దుబాయ్ లో ‘సంజు’ కోసం ప్రత్యేక అనుమతులు!

  • ‘సంజు’ టికెట్లు దొరకక అభిమానులు పడుతున్న పాట్లు
  • 24 గంటలూ ఆయా థియేటర్లు తెరిచి ఉంచేలా నిర్ణయం
  • ఈ రెండు వారాల్లో ఉదయం 4.30, 6 గంటలకు ప్రదర్శనలు

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంజు’. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. దేశ విదేశాల్లో విడుదలైన ‘సంజు’కు కాసుల పంట పండుతోంది. దుబాయ్ లో కూడా ఈ చిత్రం విడుదలైంది. సాధారణంగా దుబాయ్ లో సినిమాలు గురువారం విడుదలవుతుంటాయి.

‘సంజు’ విషయానికొస్తే దుబాయ్ లో కూడా శుక్రవారం నాడే విడుదలైంది. ఆ దేశంలో కూడా ‘సంజు’ దూసుకుపోతుండటంతో.. టికెట్లు దొరకక అభిమానులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావట. దీంతో, శుక్ర, శనివారాల్లో ఇరవై నాలుగు గంటలూ ఆయా థియేటర్లు తెరిచి ఉంచాలని దుబాయ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు వారాల్లో ఉదయం 4.30 గంటలకు, 6 గంటలకు ప్రదర్శనలకు అనుమతులిచ్చింది. కాగా, ఇప్పటి వరకు ‘సంజు’ చిత్రం దాదాపు రూ.120 కోట్ల వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు.

More Telugu News